మరో కురుక్షేత్రం...

వైసీపీలో మెరుపు నియామకాలు: మెరికలకు ఛాన్స్..!!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం..పై వైఎస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరుస పోరాటాలకు సమాయాత్తమౌతోన్నారు. తాజాగా యువజన విభాగాన్ని యాక్టివేట్ చేశారు వైఎస్ జగన్. ఇందులో భాగంగా ఇప్పటికే ఆ విభాగం స‌భ్యుల‌తో స‌మావేశం అయ్యారు. వారికి దిశానిర్దేశం చేశారు. టీడీపీ కూటమి పాలన వైఫల్యాలను గ్రామస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లడం, వరుసగా చోటు చేసుకుంటోన్నట్లుగా భావిస్తోన్న దాడులపై క్రియాశీలకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ క్రమంలో యువజన విభాగాన్ని మరింత పటిష్టం చేశారు వైఎస్ జగన్. యువజన విభాగానికి కొత్తగా అయిదుమంది కార్యనిర్వాహక అధ్యక్షులను నియమించారు. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ అయిదుమందికీ జిల్లాల బాధ్యతలనూ అప్పగించింది. కొత్తగా వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమితులైన వారిలో అన్నంరెడ్డి అదీప్ రాజు, కారుమూరి సునీల్ కుమార్, పేర్ని కిట్టు, భూమన అభినయ్ రెడ్డి, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఉన్నారు. వారికి ఆయా జిల్లాలను కేటాయించారు. ఆ జిల్లాల్లో పార్టీ బాధ్యతలను అధ్యక్షుడితో కలిసి పర్యవేక్షించాల్సి ఉంటుంది. రాష్ట్ర అధ్యక్షుడిగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజానగరం మాజీ శాసన సభ్యుడు జక్కంపూడి రాజా కొనసాగుతున్నారు.

బెంగళూరులో స్తంభించిన బస్సులు- బోసిపోయిన మెజస్టిక్

కర్ణాటకలో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల నిరవధిక సమ్మె ఆరంభమైంది. ఈ తెల్లవారు జామున 6 గంటల నుంచి బస్సులు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా బస్సులేవీ కూడా రోడ్డెక్కలేదు. బెంగళూరు సహా రాష్ట్రవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో బంద్ ప్రభావం కనిపించింది. ప్రయాణికులు, విద్యార్థులు బస్సుల కోసం పడిగాపులు పడుతున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం కేఎస్ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల ఐక్య కార్యాచరణ కమిటీ కొంతకాలంగా పోరాడుతోంది. సోమవారం కూడా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో సమావేశం అయ్యారు. అవి ఫలించలేదు. దీనితో నిరవధిక సమ్మెకు కేఎస్ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. అదే సమయంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సీనియర్ అడ్వొకేట్ ఎన్ పీ లమృతేష్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనితో హైకోర్టు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకుంది. సమ్మెను వాయిదా వేయాలని ఆదేశించింది. ఈ ఆదేశాల ఆధారంగా కేఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ అక్రమ్ పాషా.. ఉత్తర్వులు ఇచ్చారు. ఉద్యోగులు కోర్టు ఆదేశాన్ని పాటించాలని, సమ్మెలో పాల్గొనకూడదని అన్నారు.